ETV Bharat / city

TDP: కర్ణాటకలో అలా.. ఏపీలో ఇలా.. ఇది జగన్ కక్ష సాధింపు కాదా? : తెదేపా - వైకాపా తెదేపా నేతల కామెంట్స్

వైకాపా ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష తెదేపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు పెట్రో ధరలను తగ్గించినా.. సీఎం జగన్​ మాత్రం ఎప్పటిలాగే తన రివర్స్ విధానాన్ని కొనసాగిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైకాపా కుట్ర చేసిందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు.

జగన్​ ఎప్పటిలాగే తన రివర్స్ విధానాన్ని కొనసాగిస్తున్నారు

author img

By

Published : Nov 6, 2021, 7:16 PM IST

కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు పెట్రో ధరలను తగ్గించినా.. సీఎం జగన్​ మాత్రం ఎప్పటిలాగే తన రివర్స్ విధానాన్ని కొనసాగిస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు. కర్ణాటకలో పెట్రోలు రూ.101.64 డీజిల్ రూ. 85.98 గా ఉంటే.. ఏపీలో మాత్రం రూ.111.10, రూ.97.14 నుంచి కిందకు దిగలేదన్నారు. పన్నులు తగ్గించకపోవడంతో సరిహద్దుల్లో పెట్రో బంకులు మూతపడుతున్నాయన్నారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా ఏపీకి తరలివస్తోందన్నారు. ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని సోమిరెడ్డి మండిపడ్డారు. కష్టకాలంలో జగన్ ప్రజల నడ్డివిరగ్గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేాశారు. కనికరంలేని ఈ పాలన ఖచ్చితంగా ప్రజలపై కక్షసాధింపేనని ఆక్షేపించారు.

ఎన్నికల వ్యవస్థపైనా అరాచకం
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైకాపా కుట్ర చేసిందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు. వైకాపా అరాచకాలను ఎదురించి తెదేపా అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారన్నారు. 328 స్థానాలకు గానూ..322 చోట్ల తెదేపా తరపున నామినేషన్లు వేసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థను కూడా హైజాక్ చేసేందుకు జగన్ ప్రయత్నం చేసారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికల వ్యవస్థపైనా అరాచకం సృష్టించటం శోచనీయమన్నారు.

ప్రపంచ బ్యాంకు రుణం పక్కదారి
అప్పులకోసం జగన్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కి.., పలు ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నుంచి అందాల్సిన రుణాలను అందకుండా చేసిందని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ కింద వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రూ.110 కోట్లను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించారని ఆరోపించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో.. వారు నేరుగా వరల్డ్ బ్యాంకుకే ఫిర్యాదు చేశారన్నారన్నారు. వరల్డ్ బ్యాంక్, ఎన్​డీబీ, ఏఐఐబీ రుణాలు నిరాకరించడానికి జగన్ అసమర్థ పాలనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

BJP Protest: చమురు ధరలు తగ్గించాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.