ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి...
ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని గర్వంగా చెప్పుకొంటున్న సీఎం జగన్... ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో తిరిగి నామినేషన్లు వేయించేందుకు సిద్ధమా? అని.. తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ప్రశ్నించారు. నామినేషన్ల పర్వంలో జరిగిన దమనకాండ గురించి అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ అనేక విషయాలు పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు వాయిదా వేస్తే... రమేష్‌కుమార్‌కు కులం ఆపాదించడం సరికాదని హితవు పలికారు.
సోమిరెడ్డి...
రాష్ట్రఎన్నికల కమిషనర్‌కు సామాజిక వర్గం ముద్ర ఆపాదించటంపై తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. నామినేషన్లు, విత్‌డ్రాలు అయిపోయిన తర్వాత... ఎన్నికల తేదీ మాత్రమే వాయిదా పడితే ఏమౌతుందని ప్రశ్నించారు. ఎన్నికల విషయంలో అధికారులు తీరు ఒకలా ఉంటే... సీఎం తీరు దారుణంగా ఉందన్నారు. సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చిన తర్వాత రుణమాఫీ నాలుగో విడత నిధుల చెల్లింపును అడ్డుకోలేదా? అని నిలదీశారు.
చెంగల్రాయుడు...
నిమ్మగడ్డ రమేశ్‌ను సామాజికవర్గం పేరుతో నిందిస్తున్న సీఎం జగన్.... అదే సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలిసి వ్యాపారాలు ఎలా చేశారని.. తెదేపా నేత చెంగల్రాయుడు ప్రశ్నించారు. ప్రతీదాన్నీ సామాజికవర్గంతో ముడిపెట్టడం మంచిదికాదన్నారు.
ఇవీ చదవండి: కరోనా గురించి ఈ 10 విషయాలు తెలుసా?