TDP criticism on YCP Plenary: గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుతున్న వైకాపా ప్రీనరీపై తెదేపా నేతలు విమర్శలు గుప్పించారు. తన రాజకీయ అవసరాల కోసం తల్లిని, చెల్లిని వాడుకున్న జగన్.. రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. మూడేళ్లలో చేసిందేమీ లేదు కాబట్టే విపక్షాల్ని తిట్టడానికి ప్లీనరీ పెట్టారని ఎద్దేవా చేశారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మతాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న జగన్.. ప్రతిపక్షాలకు మతం అంటగట్టడం సరికాదన్నారు. తల్లి, చెల్లికి బైబిల్ ఇచ్చి ప్రజల్లో తిప్పి.. తాను మాత్రం స్వామీజీల వద్ద గంగలో మునిగారు.. అసలు జగన్ ఏ మతమో ఎప్పుడైనా చెప్పారా అని ఆనంద్‌బాబు ప్రశ్నించారు. కొత్తగా జగన్ తల్లి రాజీనామా చేయటం హస్యాస్పదమన్నారు. షర్మిల పెట్టిన పార్టీకి తన మద్దతు ఉందో లేదో జగన్ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: