అచ్చెన్నాయుడు అరెస్టు తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టుల తీరుపై ఎమ్మెల్సీ శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ప్రతీకార చర్యలతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అరెస్టు అమానుషమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కమిషన్‌కు తెలిపారు.
ఇదీ చదవండి: వైకాపాలో ‘ఎంపీ’ కలకలం