"రాష్ట్రంలో ఎగ్స్(కోడిగుడ్ల) వాడకం కంటే డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది" అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. హెరాయిన్ స్మగ్లింగ్‌లో వైకాపా నేతల పాత్ర లేకుంటే తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బడ్డీకొట్లు, టీ దుకాణాల్లో విచ్చలవిడిగా హెరాయిన్, గంజాయి, కొకైన్ విక్రయాలు జరుగుతంటే.. నిఘా, పోలీసు విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టడంలో బిజీగా ఉన్న పోలీసులు..హెరాయిన్ స్మగ్లింగ్ వెనుక ఉన్న బిగ్‌బాస్‌ను పట్టుకోవటంలో మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. పెద్దల పాత్ర లేకుండా సీఎం నివాసానికి కూత వేటు దూరంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ధైర్యం ఎవరికుంటుందని ప్రశ్నించారు.
హెరాయిన్ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలైన బిగ్బాస్లను గుర్తించి..చర్యలు తీసుకోవాలి కేంద్ర నిఘా సంస్థలను మాజీ మంత్రి దేవినేని ఉమా కోరారు. దేశ వ్యాప్తంగా రూ. 72 వేల కోట్ల విలువచేసే హెరాయిన్ అక్రమంగా రవాణా జరిగనట్లు దేవినేని తెలిపారు. దీని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం సిగ్గుచేటన్నారు.
ఇదీ చదవండి
'విజయవాడ డ్రగ్స్ విలువ రూ.9 వేల కోట్లు కాదు.. 21వేల కోట్లు!'