రాష్ట్ర రాజకీయాల్లో వైకాపా ప్రభుత్వం కొత్త సంస్కృతి మొదలు పెట్టిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయంపైనే దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో చీకటి రోజులు కొనసాగుతున్నాయని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల నోళ్లు నొక్కడమే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాలయాలు, నేతలపై పక్కా ప్రణాళికతో వైకాపా శ్రేణులు దాడులకు దిగాయని అన్నారు. తెదేపా ప్రభుత్వంలో తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ అర్డర్ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చానన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూనే పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. వైకాపా విధ్వంసం సృష్టించినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట తెదేపా కార్యకర్తలను చంపడం, నరకడం జరుగుతూనే ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో కొత్త సంస్కృతికి వైకాపా నాంది: అయ్యన్నపాత్రడు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రడు ఖండించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొత్త సంస్కృతి మొదలు పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు నోళ్లు నొక్కడమే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై పక్కా ప్రణాళికతో వైకాపా శ్రేణులు దాడులకు దిగాయని ఆరోపించారు. వైకాపా హయాంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూనే.. పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. వైకాపా విధ్వంసం సృష్టించినా.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: