ETV Bharat / city

CBN Birthday Celebrations: రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

author img

By

Published : Apr 20, 2022, 1:52 PM IST

CBN Birthday Celebrations: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి 73వ పుట్టినరోజుని పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు రాష్ట్రంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. 72కేజీల కేక్‌ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

CBN Birthday Celebrations
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

CBN Birthday Celebrations: తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు అట్టహాసంగా జరుపుకున్నారు.

అనంతపురం జిల్లా: తెలుగుదేశం కార్యాలయంలో చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం మళ్లీ ప్రగతి పరుగులు తీయాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం తప్పనిసరిగా ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చే నేత చంద్రబాబు మాత్రమేనని అన్నారు.

*వైకాపా అరాచకాలను ఎండగడుతున్న చంద్రబాబు పనితీరు నేటికీ 37 సంవత్సరాల వయస్సు గల వారిల కనిపిస్తోందని చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అన్నారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అనంతపురంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

అనకాపల్లి జిల్లా: పాయకరావుపేటలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయంలో కేక్ కోసి బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు.స్థానిక PHCలో రోగులకు పళ్లు, రొట్టెలు, పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా: పలాసలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కేక్ కట్ చేసి కార్యకర్తలతో సంబరాలు చేసుకున్నారు. ఏలూరులో 72 కేజీల కేక్‌ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

కృష్ణా జిల్లా: గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడులో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. పలుచోట్ల అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఒంగోలులో... సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గుంటూరు: తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

సత్యసాయి జిల్లా: హిందూపురంలో ఎన్టీఆర్ కూడలి వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: CBN Birthday: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.