ETV Bharat / city

Yanamala Fire On Govt: రేపు ఆ విద్యార్థులకే రీయింబర్స్​మెంట్ అంటారేమో..!: యనమల - జగన్​పై యనమల కామెంట్స్

'నేడు మద్యం తాగితేనే అమ్మఒడి అంటున్నారు..రేపు గంజాయి అమ్మిన విద్యార్థులకే రీయింబర్స్​మెంట్ అంటారేమో' అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెదేపా నేత యనమల రామకృష్ణుడు (yanamala fire on ycp govt) ఎద్దేవా చేశారు. మద్యం తాగితేనే సంక్షేమం అనే దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని యనమల విమర్శించారు.

యనమల
యనమల
author img

By

Published : Nov 25, 2021, 5:10 PM IST

మద్యం తాగితేనే సంక్షేమం అనే దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెదేపా శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు (yanamala comments on ap govt) విమర్శించారు. 'నేడు మద్యం తాగితేనే అమ్మఒడి అంటున్నారు..రేపు గంజాయి అమ్మిన విద్యార్థులకే రీయింబర్స్​మెంట్ అంటారేమో' అని ఎద్దేవా చేశారు. బీసీ జనగణనపై శాసనసభలో తీర్మానం కంటితుడుపు చర్యేనన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగినా పట్టించుకోకుండా సినిమా టికెట్లు అమ్మకం సిగ్గుచేటని మండిపడ్డారు.

'ప్రతిపక్షాలు లేకుండా బిల్లుల ఆమోదమా ? అన్నపూర్ణలాంటి రాష్ట్రంలో వరి సాగు చేయొద్దంటారా ?' అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో అనిశ్చితి సృష్టించి, వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించటం దుర్మార్గమన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కుదించి..నామినేటెడ్ పదవుల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. పంచాయతీ ప్రజాప్రతినిధుల విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం సరికాదని యనమల హితవు పలికారు.

ఇదీ చదవండి

చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యలను నిరసిస్తూ.. వర్ల దంపతుల 12 గంటల నిరసన దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.