తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల పోలీసు అధికారులు, ఎంపీడీఓ లు, రిటర్నింగ్ అధికారులు పరిధులు అతిక్రమించి వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేత వర్ల రామయ్య.. ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఫిర్యాదు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టేదిలేదని వర్ల రామయ్య అన్నారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కలిసిన వర్లరామయ్య... పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. పెడన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ ఇష్టానుసారంగా మాట్లాడిన వీడియో ఆధారాలను చూపించారు. చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. జోగి రమేష్ వ్యాఖ్యల వీడియో చూసి నివేదిక తెప్పిస్తానని ఎస్ఈసీ హామీ ఇచ్చినట్లు వర్ల పేర్కొన్నారు.
ప్రస్తుతం అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందన్న వర్ల రామయ్య.. వైకాపాకు ఓటు వేయకపోతే పథకాలు నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని ఆక్షేపించారు. కొన్ని చోట్ల పోలీస్ అధికారులు వ్యవహరించే తీరు బాధ కలిగిస్తోందన్నారు.
ఇదీ చదవండి:
ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ.. అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి