డీజీపీ గౌతం సవాంగ్.. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అడుగడుగునా తప్పుటడుగులు వేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ముఖ్యమంత్రికి విధేయుడిగా ఉంటూ.. పలు పర్యాయాలు చట్టం పరిధి దాటి వ్యవహరించిన దాఖలాలున్నాయన్నారు. సాక్ష్యాత్తూ రాష్ట్ర హైకోర్టు మందలించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతూ... తనపై, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఈ మేరకు మహ్మద్ ఇక్బాల్‌కు వర్ల బహిరంగ లేఖ రాశారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దిశ చట్టం కింద 21 రోజుల్లో శిక్షలు వేయించమని, దిశ చట్టం ఎక్కడుందో చూపాలని అడిగిన ప్రతిపక్షాలపై దాడులు చేయడమే కాక తప్పుడు కేసులు పెడతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి దిశ చట్టం కింద ముగ్గురికి ఉరిశిక్షలు.. 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందని చెప్పినప్పుడు.. వాస్తవాలు తెలిసిన డీజీపీ, ఇక్బాల్ కానీ ఎందుకు నోరెత్తలేదని నిలదీశారు. మీరు వ్యవహరించిన తీరుపై బహిరంగ చర్చకు రావాలని డీజీపీ గౌతం సవాంగ్‌కు వర్ల రామయ్య సవాల్ విసిరారు.
ఇదీ చదవండి..
MALLADI VISHNU: 'ప్రజల ప్రాణాలే ముఖ్యం.. అందుకే పండుగ ఇళ్లకే పరిమితం'