తెలుగుపై బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకున్న గౌరవం మన ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో తెలుగును అధికారిక భాషగా గుర్తించడం సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు.
మాతృభాషలో మాట్లాడటం ప్రజల హక్కుని, తల్లిభాషలో నేర్చుకున్న విద్యకే పరిపూర్ణత లభిస్తుందన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఇంగ్లీషు, హిందీ వంటి భాషలు అవసరమే.. కానీ వాటికోసం మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీని చూసైనా మన సీఎం వైఎస్ జగన్ కళ్లు తెరవాలని సోమిరెడ్డి హితవు పలికారు.
ఇదీ చదవండి: