పుర ఎన్నికల ఫలితాలతో మూడు రాజధానులను ప్రజలు సమ్మితిస్తున్నట్లు వైకాపా భావించటం మూర్ఖత్వమే అవుతుందని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ విమర్శించారు. ఆస్తిపన్నుపెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కూడా ప్రజలు అంగీకరించారని వైకాపా చెప్పగలదా అని ప్రశ్నించారు. వైకాపా అరాచకం, పోలీసులు, అధికారులు, వాలంటీర్లు, డబ్బు అనే వ్యవస్థలను నమ్ముకొని పురపోరులో అధికార పార్టీ విజయం సాధించిందని దుయ్యబట్టారు. భవిష్యత్తులో ఆ ఐదు శక్తులను ఎలా అడ్డుకోవాలనే దానిపై తెదేపా దృష్టి సారించిందని ఆయన తెలిపారు.
ఇదీచదవండి