చిత్తూరు జిల్లాలో పోలీసు వ్యవస్థ రాజ్యాంగానికి కాకుండా.. మంత్రి పెద్దిరెడ్డికి, వైకాపా నేతలకు రక్షణకవచంలా ఉంటోందని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిగి ప్రసాద్ మండిపడ్డారు. తంబళ్లపల్లె ఘటనతో ఆటవిక రాజ్యంలో ఉన్నామా.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. దాడికి పాల్పడిన ఎంతమంది వైకాపా కార్యకర్తల్ని అరెస్టు చేశారని ప్రశ్నించారు. పోలీసులు ఐపీసీని అనుసరించకుండా వైకాపాని అనుసరించటం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఉండేది రెండేళ్లు మాత్రమేనని, ఆ తర్వాత తప్పుచేసిన పోలీసుల్ని కాపాడేవాళ్లెవ్వరూ ఉండరని హెచ్చరించారు. తన సవాల్‌కు కట్టుబడి మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: