జిందాల్ స్టీల్‌కు 860 ఎకరాల భూమిని కేటాయిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్-54లో చీకటి ఒప్పందం దాగి ఉందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. వైకాపా ఎంపీ బాలశౌరీ కుటుంబానికి చెందిన కిన్నెటా గ్రూప్‌లో జిందాల్ షేర్లు కొనుగోలు చేయగా.. అదే కిన్నెటా గ్రూప్ ఓబులాపురం మైనింగ్ ఖనిజాన్ని విదేశీ కంపెనీల ద్వారా ఇతర దేశాలకు తరలించి అక్రమార్జన చేసిందని మండిపడ్డారు. కిన్నెటాగ్రూప్ ద్వారా పురుషోత్తమనాయుడుకు చెందిన స్వగృహ ఎస్టేట్స్, సీఎం జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ లో దాదాపు రూ.145 కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. తెరవెనుక దాగి ఉన్న క్విడ్ ప్రో-కో కు జీవో నెంబర్-54 ద్వారా రాజముద్ర వేసుకున్నారని పట్టాభి ఆరోపించారు.
జిందాల్‌కు భూమి కేటాయింపు..
జిందాల్ స్టీల్‌ప్లాంట్‌కు 860 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం - మోమిడి పరిధిలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కానుంది. రూ.7,500 కోట్లతో 11.6 మి.టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరగనుంది. ప్రభుత్వం కిన్నెటా పవర్‌కు ఇచ్చిన భూములు రద్దు చేసి జిందాల్‌కు స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించింది. 2,500 మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ప్లాంట్ విస్తరణకు 3 వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు.
ఇదీచదవండి.