విద్యార్థుల చదువులకు సంబంధించిన పరీక్షలను.. ముఖ్యమంత్రి వారి జీవితాలకు విషమ పరీక్షగా మార్చాడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. పలు రాష్ట్రాలు.. పది, ఇంటర్ ఆపై తరగతుల పరీక్షలను వాయిదా వేస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మూర్ఖంగా ముందుకు పోతున్నారని మండిపడ్డారు.
పరీక్షలు నిర్వహిస్తే 90లక్షల మందికి వైరస్ సోకుతుంది
పరీక్షలు నిర్వహిస్తే.. 15లక్షల మంది విద్యార్థుల కుటుంబాలు సహా, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందితో కలిపి దాదాపు 90లక్షల కుటుంబాలు వైరస్ బారిన పడే ప్రమాదముందన్నారు. ఈ విషయం గ్రహించకుండా.. సీఎం జగన్ తన ఫ్యాక్షన్ మనస్తత్వంతో, మొండిపట్టుదలతో పరీక్షలు పెడతానంటే ఎలా అని నిలదీశారు. విద్యా సంవత్సరం కుదించడంతో అటు పాఠ్యాంశాలు పూర్తికాక, ఇటు పరీక్షల్లో ఏ ప్రశ్నలొస్తాయో తెలియక విద్యార్థులు అయోమయంతో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల కారణంగా విద్యార్థులు కరోనా బారిన పడితే.. వారి తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఇదీ చదవండి:
వర్క్ ఫ్రం హోమ్ కోసం వినతిపత్రం ఇచ్చాం.. స్పందన లేదు: బొప్పరాజు