పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కాకుండా... పంచాయితీలు చేసే మంత్రిగానే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రజలకు సుపరిచితుడయ్యారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్ మండిపడ్డారు. చేసే ప్రతి పనిలో కమీషన్లకు మంత్రి అలవాటు పడ్డారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
సరైన ఇసుక పాలసీని తీసుకురాలేని మంత్రి పెద్దిరెడ్డి అసమర్థత కారణంగా 90 మంది కార్మికులు బలయ్యారని అహ్మద్ వ్యాఖ్యానించారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి కోట్లుదండుకుంటున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాకు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. జగన్ జైలుకు వెళ్తే సీఎం కుర్చీ ఎక్కాలన్న దురాలోచనతోనే రామచంద్రారెడ్డి... చంద్రబాబుపై నోరుపారేసుకుంటున్నారని మొహమ్మద్ నసీర్ అహ్మద్ ఆరోపించారు.
ఇదీ చదవండి