ETV Bharat / city

Nakka Anand Babu: సామాన్యుడికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా?: నక్కా ఆనంద్ బాబు

author img

By

Published : Oct 19, 2021, 2:56 PM IST

Updated : Oct 19, 2021, 3:54 PM IST

యువతను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని.. వారికి మద్యంతో పాటు గంజాయి అలవాటు చేస్తున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేశారు. రాష్ట్రంలో సామాన్యుడికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించారు. మద్య నిషేధమని చెప్పినవాళ్లే అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు.

tdp leader Nakka Anand Babu fires on ycp government over issuing notices to him on ganjai issue
సామాన్యుడికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా: నక్కా ఆనంద్ బాబు

రాష్ట్రంలో సామాన్యుడికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అని మాజీ మంత్రి నక్కా ఆనంద్​ బాబు(tdp leader nakka anand babu) ప్రశ్నించారు. యువతను వైకాపా(ycp) ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని.. వారికి మద్యంతో పాటు గంజాయి(ganjai) అలవాటు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పల్నాడు ప్రాంతంలో నాటు సారా ఏరులై పారుతోందన్న ఆనంద్ బాబు.. మద్య నిషేధమని చెప్పినవాళ్లే అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రశ్నిస్తే నాకు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహించారు. ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన అన్నారు.

గంజాయి రవాణా గురించి ఎలా తెలుసని పోలీసులు అడిగారు. పత్రికల్లో, మీడియాలో చూసి మాట్లాడానని చెప్పా.మేము ఇచ్చిన వాయిస్‌ను రికార్డు చేసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే ఆధారాలు ఇవ్వాలని అడుగుతారా? మద్యనిషేధం చేస్తామని చెప్పి చివరికీ మద్యం కూడా అమ్ముకుంటున్నారు. ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌ను నిర్వీర్యం చేశారు. విశాఖ ఏజెన్సీలోనే కాదు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా గంజాయి రవాణా జరుగుతోంది. -నక్కా ఆనంద్ బాబు

ఆధారాలు ఇవ్వాలని అడిగాం: నర్సీపట్నం సీఐ

నల్గొండ జిల్లా పోలీసులు ఏజెన్సీలో కాల్పులు జరిపినట్లు నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. అదేరోజు స్మగ్లింగ్ వెనుక నాయకులున్నారని ఆనంద్‌బాబు చెప్పారని..అందుకే ఆధారాలు ఇవ్వాలని అడిగినట్లు ఆయన తెలిపారు.

ఆనంద్‌బాబు స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. ఆధారాలు ఏమీలేవని ఆనంద్‌బాబు చెప్పారు. స్టేట్‌మెంట్‌లో పూర్తి వివరాలు వెల్లడించలేదు.91 సీఆర్‌పీసీ కింద నోటీసులిస్తామంటే తీసుకోలేదు. నోటీసులు తీసుకోకపోతే ఇంటికి అంటిస్తాం. సమగ్రమైన సమాచారం రాకపోవడంతోనే నోటీసులిస్తున్నాం. - శ్రీనివాసరావు, నర్సీపట్నం సీఐ

నక్కా ఆనంద్‌బాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేస్తామన్న పోలీసులు.. ప్రస్తుతానికి నోటీసులు ఇవ్వకుండానే వెళ్లిపోయారు.

సంబంధిత కథనాలు:

Nakka Anandbabu: నక్కా ఆనంద్‌బాబు ఇంటికి మరోసారి పోలీసులు...

anand babu: గంజాయి రవాణా ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు.. నిరాకరించిన నక్కా ఆనంద్‌బాబు

'ప్రభుత్వమే యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తోంది'

Last Updated : Oct 19, 2021, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.