ETV Bharat / city

Kala: 'సెకీ' విషయంలో రివర్స్ టెండరింగ్​కు వెళ్లాల్సిందే: కళా వెంకట్రావు

author img

By

Published : Nov 8, 2021, 7:23 PM IST

సెకీ నుంచి రూ. 1.99కే విద్యుత్ లభిస్తోంటే..రూ. 2.49కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెదేపా నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. పోలవరం విషయంలో రివర్స్ టెండరింగుకు వెళ్లిన ప్రభుత్వం..సెకీ ఒప్పందం విషయంలో ఎందుకు వెళ్లటం లేదని నిలదీశారు.

కళా వెంకట్రావు
కళా వెంకట్రావు

జాతీయ ప్రాజెక్టైన పోలవరం విషయంలో రివర్స్ టెండరింగుకు వెళ్లిన ప్రభుత్వం..సెకీ ఒప్పందం విషయంలో ఎందుకు వెళ్లటం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు నిలదీశారు. సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రివర్స్ టెండరింగ్​కు వెళ్లి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కేంద్రం ఆమోదించిన వారికే పోలవరం ప్రాజెక్టు టెండర్లు దక్కినా..రివర్స్ టెండరింగ్​కు వెళ్లిన విషయం జగన్ ప్రభుత్వం మరిచిందా ? అని ప్రశ్నించారు. సెకీ నుంచి రూ. 1.99కే విద్యుత్ లభిస్తోంటే..రూ. 2.49కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.

ఏపీలో 7 వేల మెగా వాట్ల పవర్ ప్లాంట్ పెట్టుంటే..రాష్ట్రానికి రూ.35 వేల కోట్ల పెట్టుబడులతో పాటు 17,500 మంది నిపుణులకు ఉద్యోగవకాశాలు వచ్చి ఉండేవని కళా అభిప్రాయపడ్డారు. గుజరాత్ రాష్ట్రం సెకీ నుంచి రూ. 1.99కే విద్యుత్ కొనుగోలు చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆయన నిలదీశారు. సెకీతో ఒప్పందం చేసుకోవాలనేది తమ నిర్ణయం కాదని..,ప్రభుత్వ నిర్ణయమన్న ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ మాటల్లో మర్మం కన్పిస్తోందన్నారు. లాలూచీ స్పష్టంగా అర్థమవుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయంలో ఏమైనా తేడాలుంటే తనకు ఇబ్బంది రాకుండా ఇంధన కార్యదర్శి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు.

ఇదీ చదవండి

Minister Balineni: 'సెకీ' నుంచి తీసుకునే సౌరవిద్యుత్ భారం రాష్ట్రమే భరిస్తుంది: బాలినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.