అధికార మత్తుతో అజ్ఞానిగా మారిన జూపూడి ప్రభాకర్.., రెండున్నర సంవత్సరాలు మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడటమేంటని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. ఇన్నాళ్లుగా ఎస్సీల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. వారిని భిక్షగాళ్లను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
59 ఉపకులాలున్న ఎస్సీ సామాజిక వర్గంలో ఐక్యత తీసుకురావాల్సింది పోగా.. వారిలో సంఘర్షణకు కారణమవడంపై ధ్వజమెత్తారు. ఎస్సీ అట్రాసిటీ చట్టాలన్నీ దుర్వినియోగమౌతుంటే జూపూడి నోరెందుకు మెదపడం లేదని అన్నారు. ఆయనకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పదవి కోసం సీఎం జగన్ చెంతన చేరిన విషయం జగమెరిగిన సత్యమని జవహర్ ఆరోపించారు.
ఇదీ చదవండి: PROTEST: ప్రైవేటు పాఠశాలలను కాపాడాలంటూ నిరసన