మంత్రి పెద్దిరెడ్డికి అభినందనలంటూ తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. అప్రాచ్య విధానాలతో వైకాపా నేతలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ సంస్థలను సక్రమంగా పని చేయించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉన్నందున, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
"చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కే జాబితాలో మంచి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. చెడ్డవాళ్ల జాబితాలో జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కించేందుకు విశేషంగా కృషి చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అభినందనలు తెలుపుతున్నా. అవినీతిపరులు ఎలా దోపిడీ చేయాలో రాసే పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రథమస్థానంలో ఉంటుంది." -గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఫలితాల తారుమారు కోసమే యాప్ వద్దంటున్నారు..
ఎన్నికల ఫలితాలు తారుమారు చేసేందుకే నిఘా యాప్ వద్దంటున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిఘా యాప్ కావాలని పిటిషన్ వేసిందే జగన్మోహన్ రెడ్డి అని గుర్తుచేశారు. ఆటవిక అరాచకపాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిహార్, ఈశాన్య రాష్ట్రాలను మించిపోతోందన్నారు. ఎస్ఈసీపై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ ధిక్కరణే అన్నారు. ఏం చూసుకుని ఇంత అహంకారం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. రంగుల పిచ్చితో ప్రజాధనాన్ని వృధా చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి:
వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వండి: ఉద్యోగ సంఘాలు