జగన్ పాలనలో అరాచకాలు, అన్యాయం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి మాటే లేదని నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఏడాది పాలనలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని... అభివృద్ధి శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధిలో ప్రభుత్వ విఫలం అనే అంశంపై సామాజిక సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై వైజాగ్ కిషోర్, నందిగామ కృష్ణలపై కేసు పెట్టడం అన్యాయమన్నారు. తెదేపాపై ట్విట్టర్లో అనేక విమర్శలు చేస్తున్న విజయసాయిరెడ్డి సంగతి ఏంటని చినరాజప్ప నిలదీశారు.
ఇదీ చదవండి: కొత్తగా 497 కరోనా కేసులు... పదివేలు దాటిన బాధితులు