కరోనా రోగులకు వైద్యం చేస్తూ.. ప్రాణాలు కోల్పోయిన వైద్యులు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు..
- కరోనా బారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడే పోరాటంలో మృతి చెందిన వైద్యుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి
- చనిపోయిన డాక్టర్లు, వైద్య సిబ్బంది అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలి
- ఆగస్ట్ 15, జనవరి 26 వంటి జాతీయ పర్వ దినాల్లో వారికి ప్రత్యేక పురస్కారాలు ఇచ్చి గౌరవించి సముచితంగా సత్కరించాలి
- డాక్టర్లు, వైద్యసిబ్బందికి నాణ్యమైన రక్షణ ఉపకరణాలు(పీపీఈలు) ఇవ్వడంతో పాటు ప్రత్యేక ప్యాకేజి అదనంగా ప్రకటించాలి
- కరోనా పోరులో డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివి
- కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యుల సేవలు చిరస్మరణీయం
- వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై పోరాటం సాగిస్తున్నారు
- వారికి అందరూ పూర్తిగా సహకరించాలి
- ప్రాణదాతలుగా వారిని అందరూ గౌరవించాలి
- యుద్దభూమిలో సైనికుల్లా డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా నుంచి పోరాడుతున్నారు
- వారి సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.
ఇదీ చూడండి కేంద్రమంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ.. కారణం ఇదీ..!