తనపై తనకు నమ్మకం లేకనే ఒక్క అవకాశం అంటూ.. జగన్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు(budda venkanna on CM Jagan one chance sloga). ఒకసారి ముఖ్యమంత్రి అయితే ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వరని తెలిసే.. ఒక్క అవకాశం నినాదం అందుకున్నారని విమర్శించారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
"జగన్ రెడ్డిని ఒకసారి ముఖ్యమంత్రిగా చూసిన ప్రజలు.. ఇక తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఏపీ నరకాసుడిగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి(budda venkanna on CM Jagan)కి ప్రజలు.. తమ ఓటు రూపంలో బుద్ధి చెప్పి నిజమైన దీపావళి జరుపుకునేందుకు వేచి చూస్తున్నారు" - బుద్ధా వెంకన్న
బద్వేల్ ఉపఎన్నికపై వైకాపా సంబరాలు కామెడీ సినిమా చూసినట్లుందని(budda venkanna on badvel bypoll) అన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెదేపా పోటీ చేయకపోయినా.. దొంగఓట్లు వేయించుకుని మరీ గెలిచారని ఆరోపించారు. వైకాపాకు నిజంగా అంత ప్రజాదరణే ఉంటే 151మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గమనించే.. ప్రశాంత్ కిశోర్ బృందంతో మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అసత్యాల ప్రచారం చేపట్టారని అన్నారు. ఒకప్పుడు బీహార్ రాష్ట్రాన్ని చూసి ఛీకొట్టినవాళ్లంతా.. ఇప్పుడు ఏపీని ఛీకొడుతున్నారు అని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు.
ఇదీ చగవండి..
Mahapadayathra: మూడో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం