తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ ఆరోపణలపై తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్ స్పందించారు. 24 గంటల్లో సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించకుంటే.. దేవాదాయశాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఇంతవరకు మంత్రి విచారణకు ఆదేశించకపోవడాన్ని తప్పుపట్టారు.
వెంకన్నకు ఇచ్చిన తలనీలాలు ఎవరికి అమ్ముతున్నారో తితిదేకు తెలియకపోవడం దారుణమని రాంప్రసాద్ విమర్శించారు. తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అని తితిదే ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. తలనీలాలు స్మగ్లింగ్ జరుగుతుంటే పాలకమండలి ఏమి చేస్తోందని నిలదీశారు.
సంబంధిత కథనం: