Ashok gajapathiraju moves to high court: విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ.. కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టు ప్రారంభం కాగానే ఆయన తరపు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌ను అభ్యర్థించారు. సోమవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
నెల్లిమర్ల మండలం రామతీర్ధం గ్రామం బోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన పనుల విషయంలో.. ఆటంకం కలిగించారని పేర్కొంటూ అశోక్ గజపతి రాజుపై.. ఆలయ ఈవో డీవీవీ ప్రసాదరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు.. ఈనెల 22 న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తనపై నమోదు చేసిన సెక్షన్లు ఆయా పరిస్థితులకు చెల్లవని.. తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని అశోక్ గజపతిరాజు పిటిషన్లో పేర్కొన్నారు.
తనను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశంతో కేసు నమోదు చేశారని, ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని ఫిర్యాదులో కోరారు. అరెస్ట్‌తో పాటు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
Police Notice to Ashok Gajapathiraju: అశోక్ గజపతికి పోలీసుల నోటీసు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్