జాబ్ క్యాలెండర్ను నిలదీసిన నిరుద్యోగులపై అత్యాచారం కేసులు పెట్టడం తుగ్లక్ విధానమేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు పాల్పడిన వైకాపా నేతలపై కేసులు పెట్టకుండా నిరుద్యోగులపై పెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రజలపై తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగాల హామీని విస్మరించిన సీఎం జగన్.. తక్షణమే పదవికి రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చి సునామీ సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి.. అధికారంలోకి వచ్చాక యువతను అరెస్టు చేయించి, తప్పుడు కేసులు పెట్టడం తప్ప సాధించిందేమీ లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాల ప్రకటనను హోరెత్తించి రెండేళ్ల తర్వాత జాబ్ క్యాలెండర్ పేరిట జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల్ని మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.