పురపాలక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే ఎలాంటి పన్ను లేకుండా.. ఉచితంగా మంచి నీరు అందిస్తామని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రజలకు రక్షిత నీరు అందించటంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలుషిత నీటి వల్ల ప్రజలు అంతుచిక్కని వ్యాధితో నేటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్నూలులోనూ ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 50 మంది అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. ప్రభుత్వం నీటి బకాయిలు చెల్లించని కారణంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి మున్సిపాలిటీలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితి కనిపిస్తోంది'