పేద ప్రజలను అధికార పార్టీ నానా అవస్థలకు గురి చేస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అధిక సంఖ్యలో పింఛన్లు రద్దు కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దు చేసిన పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుపై ఎమ్మెల్యేలు, ఎంపీ విజయసాయిరెడ్డి మట్లాడి నవ్వుల పాలు అవుతున్నారన్నారు. కృష్ణా జలాలను గొల్లపల్లి రిజర్వాయర్‌కు తీసుకువచ్చి పరిశ్రమకు నీటి సౌకర్యాలు కల్పించి... కియా పరిశ్రమ ఏర్పాటయ్యేలా... చంద్రబాబు నాయుడు చేసిన కృషిని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారని అన్నారు.
పోలీసుల పహారాలో తిరుగుతున్నారు
అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగాలంటే పోలీసుల పహారాతో తిరుగుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను పెట్టి గ్రామాల్లో, పట్టణ వార్డుల్లో నిజమైన ఫించనుదారులకు పెన్షన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిపాలన వల్ల ప్రతి ఒక్కరూ అవస్థలు పడుతున్నారని వాపోయారు.
ఇదీ చదవండి: