రాష్ట్ర ప్రభుత్వం చేసిన 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమయ్యాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సంక్షేమం కోసం అప్పులు చేశామని అనడమంటే.. పేదలను దోషుల్ని చేయడమేనని స్పష్టం చేశారు. 2019-20 నుంచి 2021 జులై 31 మధ్య 2 లక్షల 139 కోట్ల అప్పు, పన్నుల పెంపుతో మరో 75 వేల కోట్లు అదనపు భారం ప్రజలపై పడిందని చెప్పారు.
స్కీముల పేరిట స్కాములు చేస్తూ.. ప్రజా సంపద దోచేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పేరుతో 6,500 కోట్లు లూఠీ చేశారన్నారు. పిచ్చి బ్రాండ్ల మద్యాన్ని ప్రజలతో తాగిస్తూ ఏటా 6 వేల కోట్లు దోచేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: