TDP formation day: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో పార్టీ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెదేపా శ్రేణులు నివాళులర్పించారు. ఎన్జీవో కాలనీలో ఎన్ఆర్ఐల సహకారంతో పేదలకు చీరలు పంపిణీ చేశారు. పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోనూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో గ్రామగ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ చేపట్టి.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు సన్మానం చేశారు. నంద్యాలలో తెదేపా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సందడిగా సాగింది. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు నృత్యాలు చేసి సందడి చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.
తెదేపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనంతపురంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ భవన్లో సీనియర్ నాయకులను సన్మానించనున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: CBN and lokesh on formation day: 'తెదేపా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుంది'