ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించినందున ఎన్నికలు నిలుపుదల చేయాలని వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కడప జిల్లాకు చెందిన ప్రతాప్‌రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులు పిటిషన్లు వేశారు. స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వే షన్లు ఉండటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి