బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అంపన్’ తుపాను బంగ్లాదేశ్ వైపు వెళుతోంది. ఇవాళ సాయంత్రం బంగ్లాదేశ్‌లోని హతియా దీవులు, పశ్చిమబంగాల్ లోని డిగాల మధ్య తీరం దాటవచ్చని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. దీని ప్రభావం తెలంగాణపై ఏమీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇక వేసవి ఎండల తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. వడ గాలుల తీవ్రతతో ప్రజలకు బయటికొచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ప్రతాపం చూపుతున్నాడు. దీనికితోడు గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల ఉక్కపోత ఎక్కువైంది.
ఇదీ చూడండి: