ETV Bharat / city

UKRAINE: రాష్ట్రానికి చేరుకుంటున్న విద్యార్థులు.. మా పిల్లల్నీ స్వదేశానికి రప్పించండి.. తల్లిదండ్రుల మొర

author img

By

Published : Mar 3, 2022, 7:24 AM IST

Updated : Mar 3, 2022, 10:23 AM IST

Telugu Students at Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడుల నేపథ్యంలో అక్కడ ఉన్న మన విద్యార్థులను కేంద్రం ప్రత్యేక రైలులో విద్యార్థులను సరిహద్దుల్ని దాటిస్తోంది. అనేక మంది తెలుగువాళ్లు స్వదేశం చేరుకుంటున్నారు. ఇప్పటికే 80మంది రాష్ట్ర విద్యార్థులు స్వస్థలాలకు చేరుకోగా..ఇంకా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తమ పిల్లల్ని భారత్‌కు రప్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కాగ.. ఇవాళ దిల్లీ నుంచి వచ్చిన నలుగురు విద్యార్థులకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

students safely reached india from Ukraine
ఉక్రెయిన్​ నుంచి రాష్ట్రానికి 80 మంది విద్యార్థులు

ఉక్రెయిన్ నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న తెలుగు విద్యార్థులు

Russia- Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు తీవ్రరూపం దాలుస్తుంటే మరోవైపు అక్కడున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. రైలు మార్గంలో సుమారు 1500 మంది భారతీయ విద్యార్థులు సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవడంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇందులో వంద మందికిపైగా తెలుగువాళ్లు ఉన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వినుకొండ వైద్య విద్యార్థులు కటకం ప్రసన్న, సుంకర నాగమణి సురక్షితంగా బుడాపెస్ట్ చేరారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జతిన్ తేజ రోమెనియాకు చేరుకోగా.. తేజ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధైర్యం చెప్పారు. వివిధ ప్రాంతాలకు చెందిన మరో ఐదు మంది విద్యార్థులు దిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. ప్రకాశం జిల్లా దేశాయిపేటకు చెందిన యర్రా అఖిల..చింతపూడి వాసి రీణా తెజోన్మయి భయానక పరిస్థితులు తరువాత ఇంటికి చేరారు.

మా పిల్లల్ని స్వదేశానికి రప్పించండి..

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. వీరిలో ఓ విద్యార్థిని ఇంటికి చేరుకున్నారు. మరో ముగ్గురు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ కుమారుడు రవితేజను స్వదేశానికి రప్పించాలని విజయవాడకు చెందిన రాధాకుమారి విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా పామిడికి చెందిన నవాజ్ షరీఫ్‌ను ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు తీసుకురావాలని అతని తల్లిదండ్రులు తహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు.

ఉక్రెయిన్​కు ప్రతినిధుల బృందం..

ఉక్రెయిన్‌లోని తెలుగువాళ్లను తీసుకువచ్చేందుకు ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కడకు పంపనుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని హంగరి, పోలాండ్, రొమేనియా, స్లొవేకియా దేశాలకు ప్రతినిధులను పంపనున్నట్లు వెల్లడించింది.

గన్నవరం చేరుకున్న నలుగురు విద్యార్థులు
Students Reached to Gannavaram Airport: ఉక్రెయిన్​ నుంచి దిల్లీకి వచ్చిన నలుగురు విద్యార్థులు.. ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో విద్యార్థులకు డిప్యూటీ తహసీల్దార్​ శ్రీనివాసరావు, టెర్మినల్ మేనేజర్ శ్రీలేఖ స్వాగతం పలికారు. విజయవాడ మొగలరాజపురంకు చెందిన పి.విహారి, కొలకలూరుకు చెందిన షైక్ రేష్మ, విజయవాడ వన్‌టౌన్‌ ఇంచుపేటకు చెందిన మేరీ మంజరి, ఆగిరిపల్లికి చెందిన కావాటి నరసింహారావులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 3, 2022, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.