కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా... రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు దిగజారుతూ వస్తోంది. వివిధ శాఖల ద్వారా సమకూరే ఆదాయం... ఒక్కసారిగా స్తంభించింది. రాష్ట్ర ఖజానాలోకి నిధుల రాక దాదాపుగా శూన్యమైంది. ప్రతి వారం సగటున వంద కోట్ల ఆదాయమిచ్చే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి.. మార్చి చివరి వారంలో సుమారు 3 కోట్లు మాత్రమే వచ్చాయి. రోజూ 65 కోట్ల మేర జరిగే మద్యం అమ్మకాలూ... పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపారాలు లేకపోవటంతో... అమ్మకపు పన్ను రాబడి పూర్తిగా ఆగిపోయింది. వాహన విక్రయాల ద్వారా మార్చిలో కేవలం 178 కోట్ల ఆదాయమే సమకూరింది. ఉగాది నేపథ్యం... బీఎస్4 వాహనాల అమ్మకాల రూపంలో అధిక రాబడి వస్తుందని భావించినా లాక్‌డౌన్ వల్ల 100 కోట్లు నష్టపోయినట్టు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాలుగా నెలకు 15వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేసుకున్నారు. రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయాలు కలిపి నెలకు 6వేల 500 కోట్లు..... కేంద్రం నుంచి జీఎస్టీ రూపంలో వారానికి 500 కోట్లు పన్నుల వాటాగా 2వేల కోట్ల వరకూ వస్తుంది. అప్పుల రూపంలో నెలకు 3వేల 500 కోట్లకుపైగా సమకూర్చుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సొంత ఆదాయం, జీఎస్టీ వసూళ్లపై భారీ ప్రభావం పడింది. కరోనా ఖర్చుల రూపంలో ఎప్పుడూ వెయ్యి కోట్ల వరకూ రిజర్వులో ఉంచుకోవాలనిఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం..రుణాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. తొలి త్రైమాసికంలో పదివేల కోట్ల అదనపు రుణం రిజర్వ్ బ్యాంకు ద్వారా సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఆర్థికసంస్థల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తేనే పరిస్థితి నుంచి... గట్టెక్కగలమని కేంద్రానికి తెలియచేసింది. కేంద్రం నుంచి పన్నుల వాటా మొత్తం కూడా ముందే ఇవ్వాలని కోరుతోంది.
ఇదీ చూడండి: