రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు అందిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అధ్యక్షుడిగా బబ్బూరి శ్రీరామ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి సోము వీర్రాజు హాజరయ్యారు.
విద్య, వైద్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఇలా 35 అంశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు అందుతున్నాయని వీర్రాజు చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంబీబీఎస్ కళాశాల ఏర్పాటు ప్రధాని మోదీ ఆలోచన అని వివరించారు. మరోవైపు అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్న వారంతా విజయవాడ, అమరావతి చుట్టూ జరుగుతున్న అభివృద్ధి చూడాలని ఆయన కోరారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే పోలవరం నిర్మాణం కేంద్రం పూర్తి చేస్తుందని పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి