ETV Bharat / city

PRC: 'పీఆర్సీ సహా ప్రధాన డిమాండ్ల సాధనలో.. ఉద్యోగ సంఘాలు విఫలం' - ఉద్యోగ సంఘాలు నేతలు

PRC: పీఆర్సీ సహా ప్రధాన డిమాండ్ల పరిష్కారంలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అసోయేషన్ ధ్వజమెత్తింది. ఉద్యోగుల్లో భరోసా కల్పించలేని ఉద్యోగ సంఘాల నేతలు క్షమాపణ చెప్పి, వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు.

పీఆర్సీ సహా ప్రధాన డిమాండ్ల సాధనలో ఉద్యోగ సంఘాలు విఫలం

author img

By

Published : Jan 9, 2022, 6:13 PM IST

PRC: పీఆర్సీ సహా ప్రధాన డిమాండ్ల పరిష్కారంలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అసోయేషన్ ధ్వజమెత్తింది. ఉద్యోగ సంఘాల ఐకాస నుంచి బయటకు వచ్చి.. ఉద్యోగుల సర్వీసు అసోషియేషన్​గా ఏర్పడి డిమాండ్ల పరిష్కారంపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు వెల్లడించారు.

ఉద్యోగుల హక్కులను కాపాడాలనే ఉద్దేశం నుంచే తమ అసోషియేషన్ పుట్టిందన్నారు. పలు కీలక డిమాండ్ల సాధనలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఏ మాత్రం ఒత్తిడి తీసుకురాలేక పోయారని ఆయన విమర్శించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​లోని ప్రధాన సంఘాలు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో భరోసా కల్పించలేకపోయారన్నారు. ఉద్యోగుల్లో భరోసా కల్పించలేని ఉద్యోగ సంఘాల నేతలు క్షమాపనలు చెప్పి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కనీసం పీఆర్సీ రిపోర్టు లేకుండా చర్చలకు వెళ్లి.. 23 శాతం ఫిట్​మెంట్​కు ఒప్పుకోవటం దారుణమన్నారు. ఐఆర్ కంటే ఎక్కువ సాధించాల్సిన పీఆర్సీని 23 శాతానికే పరిమితం చేయటం ఆక్షేపణీయమన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముందు చెప్పినట్లుగా అక్టోబర్ 1 నుంచి సర్వీసులను క్రమబద్దీకరించాలని రాజారావు డిమాండ్ చేశారు.

పీఆర్సీపై ఉద్యోగుల్లో అంసతృప్తి..
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై సామాన్య ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని వీఆర్వోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. ఐఆర్ 27 శాతం ఉండగా.. కనీసం 30 శాతం పీఆర్సీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ సచివాయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వెంటనే ప్రొహిబిషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ మంజూరు చేయాలన్నారు. వయోపరిమితి 60 నుంచి 62 ఏళ్లకు పెంచటం ద్వారా నిరుద్యోగులు ఇబ్బంది పడతారని రవీంద్రరాజు తెలిపారు.

ఇదీ చదవండి

AP Govt On PRC: ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.