జగన్తో మోదీ లాలూచీ పడ్డారని తెదేపా నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్కు అండగా నిలవటంతోనే మోదీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. అమరావతి , పోలవరంపై జగన్ తన పత్రికలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు. మోదీ, జగన్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏం చేయలేరన్నారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి