10th Class Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో.. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటిస్తారు. మే 23 నుంచి ఈనెల 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 401 పాఠశాలలకు చెందిన.. 5 లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
ఇవీ చదవండి: