Sri Cements MD Meet CM Jagan: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని శ్రీ సిమెంట్స్ ఎండీ హెచ్ఎం బంగూర్ స్పష్టం చేశారు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి జగన్తో సమావేశమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ పారిశ్రామిక పరంగా, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నామని అన్నారు. వృద్ధిరేటులో జాతీయ సగటు కంటే ఏపీ వృద్ధిరేటు ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగారిపాడు వద్ద సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు బంగూర్ తెలిపారు. మొత్తం రూ.1,500 కోట్లతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సీఎం జగన్తో భేటీ అయ్యి, ఈ అంశాన్నే వివరించినట్టు చెప్పారు.
ఇదీ చదవండి :