కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్లో ఆకలితో అలమటించిన మనుషుల ఆకలి తీర్చేందుకు సాటి మనిషి ముందుకొచ్చాడు. మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. కానీ మూగజీవాల పరిస్థితేంటి? వాటి ఆకలి కేకలు అరణ్యరోదనగా మిగిలాయి. ఎవరో కొద్దిమంది మాత్రమే వాటివంక చూసి తిండిపెట్టి ప్రాణం పోశారు.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో ఉన్న ఓ గోశాలలో మాత్రం వందలాది గోమాతలు ఆకలితో అల్లాడుతున్నాయి. పశుగ్రాసం దొరకక డొక్కలెండిపోయి... మౌనంగా రోదిస్తున్నాయి. దాతలెవరైనా తమపై దయచూపి పచ్చిగడ్డో, ఎండుగడ్డో తెస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాయి. వేళకు తిండి దొరకకపోవడం వల్ల నీరుతాగి ఆకలిబాధను తీర్చుకుంటున్నాయి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి