ETV Bharat / city

కొవిడ్​ రోగులు కోలుకోవాలని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - Durgamalleshwara Swamy Temple news

సీవీ రెడ్డి ఛారిటీస్​ కొవిడ్​ కేర్​ సెంటర్​లో చికిత్స పొందుతున్న రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి రుసుము తీసుకోకుండా పూజ చేసినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో డి.భ్రమరాంబ తెలిపారు.

durga temple
దుర్గగుడి
author img

By

Published : May 22, 2021, 6:05 PM IST

విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సీవీ రెడ్డి ఛారిటీస్​ కొవిడ్​ కేర్​ సెంటర్​లో చికిత్స తీసుకుంటున్నవారు కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న మహా మృత్యంజయ హోమానికి.. రుసుము తీసుకోకుండా బాధితుల గోత్రనామాలతో పూజ చేసినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో డి.భ్రమరాంబ తెలిపారు.

స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తున్నాామని ఆలయాధికారులు తెలిపారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా నిత్య ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అవకాశం లేనందున.. పరోక్షంగా అవకాశం కల్పిస్తునట్లు చెప్పారు. దేవస్థానంలో జరుగుతున్న హోమాలు, సేవలు భక్తుల గోత్ర నామాలతో ఆన్​లైన్​ ద్వారా జరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. స్వామి, అమ్మవార్ల సేవలో పాల్గొనేందుకు www.kanakadurgamma.org website నుంచి భక్తులు టికెట్లు పొందవచ్చని చెప్పారు.

ఇదీ చదవండి: రేపు నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.