లాక్డౌన్ కారణంగా సింగపూర్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిని సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేక విమానంలో పంపుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 146 మంది ప్రయాణికులతో సింగపూర్ నుంచి ప్రత్యేక విమానం బయలుదేరింది. తెలంగాణకు చెందిన 82 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 62 మంది, తమిళనాడుకు చెందిన ఇద్దరు ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
ప్రత్యేక విమానాన్ని సింగపూర్ తెలుగు సమాజం ఏర్పాటు చేసింది. కాసేపట్లో సింగపూర్ నుంచి ప్రత్యేక విమానం బయల్దేరనుంది. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఇదీ చూడండి: చైనా ఆ కారణంతోనే భారత్‌ను రెచ్చగొడుతోందా?