విజయవాడ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మూడ్రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్(Special drive at Vijayawada Commissionerate) నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 223 మందిపై కేసులు నమోదు చేశారు. ఎక్కువ చలానాలు పెండింగ్లో ఉన్న వాహనాలను గుర్తించిన పోలీసులు... వాహనదారుల నుంచి రూ.5.85 లక్షలు వసూలు చేశారు.
కమిషనరేట్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో యువతులను వేధిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేశారు. దిశా యాప్ నుంచి 228 ఫోన్ కాల్స్ రాగా.. 53 మంది సమస్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివహించారు.
ఇదీ చదవండి...
e-kyc: వాలంటీర్, రేషన్ డీలర్ల వద్దే ఈ-కేవైసీ నమోదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్