ETV Bharat / city

pollution in rivers: కాలుష్యం కోరల్లో.. జీవనదులు... - కృష్ణా నదిలో కాలుష్యం వార్తలు

నాగలి కథకు, నాగరికతకూ జీవం పోసిన నదులు నేడు జీవం కోల్పోయే స్థితికి చేరుకుంటున్నాయి. మానవ ఆక్రమణలు, కర్మాగారాల నుంచి విడుదలయ్యే విష జలాలు, ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌లతో నదులు కుంచించుకుపోతున్నాయి. మురుగునీరు, టన్నుల కొద్దీ చెత్తను తనలో కలుపుకున్న కృష్ణా, గోదావరి నదుల గర్భశోకాన్ని ప్రజలు ఆలకించాలని పర్యావరణ పరిరక్షకులు కోరుతున్నారు.

pollution in rivers
pollution in rivers
author img

By

Published : Sep 30, 2021, 7:29 PM IST

కాలుష్య బారిన పడుతున్న జీవనదులు...శుభ్రతపై దృష్టిపెట్టాలంటున్న నిపుణులు

దేశంలోని అత్యంత పొడవైన నదుల్లో కృష్ణానది ఒకటి. నీటి ప్రవాహం పరంగా చూస్తే దేశంలోనే నాలుగో అతిపెద్ద నది. నదీతీరం వెంట ఏర్పడిన ఆవాసాలు, పరిశ్రమల నుంచి విడుదలయ్యే వేల గ్యాలన్ల మురుగునీరు, టన్నుల కొద్దీ చెత్త కలవటంతో ఆ నది కలుషితమవుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజల అలక్ష్యం కృష్ణమ్మ పాలిట శాపంగా మారింది.

ప్రజలు విడుదల చేసే చెత్తాచెదారంతోపాటు... కొన్నిచోట్ల పరిశ్రమల నుంచి కలుషిత నీరు కృష్ణమ్మలో కలుస్తోంది. అధికారులు వీటిని చూసీ చూడనట్లుగా వదిలేయటం కృష్ణమ్మ అనారోగ్యానికి కారణమవుతోంది. విజయవాడలోని డ్రైనేజీ నీరు పెద్దమొత్తంలో కృష్ణా నదిలోనే కలుస్తోంది. బందరు కాలువ, రైవస్ కాలువల్లోకి నగరంలోని అవుట్‌ఫాల్ డ్రైయిన్లు కలిపి ఉన్నాయి. దాదాపు 29 డ్రైయిన్లు పంట కాలువకు కలిసుండడంతో మురుగుకాలువల్లా మారిపోయాయి. తరచూ కురిసే భారీ వర్షాలకు డ్రైయిన్లు పొంగి చివరకు కృష్ణా ఒడికే చేరుకోక తప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో నదీ స్వచ్ఛత ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలుష్య నియంత్రణ మండళ్లు నదుల్లోని వివిధ ప్రాంతాల్లో నమూనాలు సేకరించి నీటి పరీక్షలు నిర్వహించినప్పుడు.. గోదావరి, కృష్ణా రెండు నదుల్లోని నీరు సీ కేటగిరిలోకి రావడం ఎంతో ఆందోళన కలిగించే అంశం. నీరు ఏ, బీ కేటగిరీల్లో ఉన్నప్పుడు వాటిని శుద్ధి చేసుకొని తాగేందుకు వీలుంటుంది. సీ కేటగిరీ అంటే స్నానం చేసేందుకూ పనికిరాని స్థితికి చేరినట్లు భావించాలి. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ తోనే 80 శాతం నష్టం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. భావితరాల కోసం నదిని పరిశుభ్రంగా ఉంచాలనే బాధ్యతను ప్రభుత్వాలు, ప్రజలు తలకెత్తుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి

అక్టోబర్ అలర్ట్.. ఒకటో తేదీ నుంచి వచ్చే మార్పులు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.