రాష్ట్రంలో పెద్ద క్రీడా మైదానాల్లో విజయవాడ ఇందిరాగాంధీ మైదానం ఒకటి. ఇక్కడ రోజూ వేల మంది.. వివిధ క్రీడల్లో ప్రాక్టీస్ చేస్తుంటారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ మైదానాన్ని ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల కోసం వినియోగించడం ఎక్కువైంది. పంద్రాగస్టు వేడుకల కోసమని గ్రౌండ్‌ను అధీనంలోకి తీసుకున్న అధికారులు.. దాదాపు 15 రోజులు దాటినా ఖాళీ చేయలేదు. పైగా.. మైదానంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నట్లు నోటీసులు అంటించారు. దీనికితోడు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన చెత్త వాహనాలతో మైదానాన్ని నింపేశారు. భారీ వాహనాలూ.. మైదానంలో ఇష్టం వచ్చినట్లు తిప్పుతున్నారు. దీనివల్ల రన్నింగ్ ట్రాక్ పాడై ప్రాక్టీస్‌కు పనికిరాకుండా పోతోందని.. క్రీడాకారులు వాపోతున్నారు. ప్రాక్టీస్ చేసుకునేందుకు లోపలికి.. అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడా మైదానాన్ని ప్రభుత్వ కార్యక్రమాల కోసం వినియోగించడాన్ని.. క్రీడాసంఘాల సభ్యులు తప్పుపడుతున్నారు. CM, గవర్నర్ కార్యక్రమాలకు తప్ప మిగతా కార్యక్రమాలకు అనుమతి లేకున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారని మండిపడుతున్నారు. క్రీడా మైదానాన్ని వెంటనే ఖాళీ చేయాలని, లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని.. క్రీడాసంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండీ.. నందిగామలో ఆక్రమణల తొలంగిపు..వ్యాపారుల ఆందోళన..ఉద్రిక్తత