మీరు తెలంగాణ వెళ్లినప్పుడు ఏయే వంటలు తిన్నారు అంటే ఒక్కొక్క చోట ఒక్కో వంటకం పేరు చెబుతారు. కాని అన్ని రకాల వంటకాలు ఒకచోట దొరకవు కదా... అదే నిజమైతే ! ఊహించుకుంటేనే నోట్లో నీరు ఊరుతున్నాయా? అదేంటి అన్ని ఒకే చోట దొరకడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఏదైనా ఎగ్జిబిషన్? లేక స్టాల్స్ పెట్టారా అని ఆలోచిస్తున్నారా? అయితే ఒక సారి తెలంగాణకు వెళ్లాల్సిందే మరి....
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో తెలంగాణ ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు కొనసాగే ఈ ఫెస్టివల్‌లో తెలంగాణలో లభించే రుచికరమైన శాఖాహార, మాంసాహార వంటలను భాగ్యనగర భోజన ప్రియులకు రుచులు చూపిస్తున్నారు. వారి సాంప్రదాయ వంటకాలైన కల్లు కోడి, చుక్కకూర మాంసం, సరువ పిండి, మెంతికూర పప్పు వంటి వంటలను అందిస్తున్నట్లు హోటల్ చెఫ్ తిరుపతిరెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడేలా చక్కటి అలంకరణతో ఏర్పాటు చేసిన ఈ ఆహారోత్సవం భోజన ప్రియులకు నోరూరిస్తోంది.
ఇవీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం