ETV Bharat / city

సంప్రదాయేతర విద్యుదుత్పత్తి పెంపు యోచనలో ప్రభుత్వం - ఏపీలో సోలార్ విద్యుత్ వార్తలు

సంప్రదాయేత ఇంధనవనరుల ద్వారా విద్యుదుత్పత్తిని గరిష్ఠానికి....చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ రెన్యూవబల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ- 2020 కింద... సౌర, పవన విద్యుత్ సహా హైబ్రీడ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. బయోమాస్‌, వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్లు, రూఫ్‌టాప్‌ సౌర ఫలకాలనూ.. గ్రిడ్‌కు అనుసంధానించాలని భావిస్తోంది.

సంప్రదాయేతర విద్యుదుత్పత్తి పెంపు యోచనలో ప్రభుత్వం

author img

By

Published : Jan 15, 2021, 5:09 AM IST

సంప్రదాయేతర విద్యుదుత్పత్తి పెంపు యోచనలో ప్రభుత్వం

రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3వేల 522 మెగావాట్ల సౌరవిద్యుత్‌ 4వేల 79 మెగావాట్ల పవన విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. మరో పదివేల మెగావాట్ల.... సౌరవిద్యుత్‌ పార్కు ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించేందుకు....... ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు.. రాష్ట్రంలో సోలార్‌ రూఫ్‌టాప్ వ్యవస్థ ద్వారా 19.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని గొల్లవానితిప్ప వద్ద కాలువపై సౌరఫలకాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన.. ఈ ప్రాజెక్టు విజయవంతమయింది. ప్రస్తుతం ఇక్కడ ఒక మెగావాట్‌ విద్యత్‌ ఉత్పత్తి అవుతోంది. నిరుపయోగ స్థలాలనూ సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

వనరుల సమర్థ వినియోగానికి గాలి మరల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా హైబ్రీడ్ ప్రాజెక్టులకూ అధికారులు రూపకల్పన చేశారు. భారీ బ్యాటరీల ఏర్పాటు ద్వారావిద్యుత్‌ను కొంతమేర నిల్వ చేయాలన్నది దీని లక్ష్యం. ఈ తరహా ప్రాజెక్టును..... అనంతపురం జిల్లాలోని రామగిరిలో ఏర్పాటు చేశారు. ఈ హైబ్రీడ్ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 160 మెగావాట్లి కాగా ఇందులో 120 మెగావాట్ల మేర సౌరవిద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 40 మెగావాట్ల... పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అత్యవసర వినియోగానికి 10 మెగావాట్ల మేర విద్యుత్‌ను నిల్వ చేస్తున్నారు.

రాయలసీమలో 5 గిగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ఎన్టీపీసీ ఆసక్తి చూపుతోంది. కర్నూలులో 2 గిగావాట్లు, అనంతపురంలో 3 గిగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు.. చేసే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

ఇవీ చదవండి

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్​ను ఏపీతో పంచుకోండి: తెలంగాణకు నిపుణుల కమిటీ సూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.