తెరాస: బస్తీలు, మురికివాడల్లోని ఓటర్లు తమకే మద్దతు పలుకుతారని తెరాస ముఖ్యులు విశ్వసిస్తున్నారు. ప్రచారంపై ఇప్పటికే కేటీఆర్ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు, రెండు పడక గదుల ఇళ్లపై విస్తృతంగా ప్రచారం నిర్వహించే బాధ్యతను ఎమ్మెల్యేలు, సిట్టింగ్ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నాయకులకు ప్రత్యేకంగా అప్పగించారు.
ప్రచారాస్తాలు: వరద సాయం పంపిణీ నిలిచిపోవడానికి ప్రతిపక్షాలే కారణమనే వాణిని ఓటర్లలోకి తీసుకెళ్తున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఎంత వరకొచ్చిందనేది వివరిస్తున్నారు.
భాజపా: గెలిచేందుకు అవకాశమున్న డివిజన్ల పరిధిలోకొచ్చే మురికివాడలు, బస్తీల జాబితాను భాజపా ఇప్పటికే తయారు చేసింది. ఆయా ప్రాంతాల్లో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, బీఎంఎస్ తదితర అనుబంధ సంఘాల కార్యకర్తలు విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రచార సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి దిశా నిర్దేశం చేసే బాధ్యతను సీనియర్ నాయకులకు అప్పగించారు.
ప్రచారాస్త్రం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా, వరద సాయం పంపిణీలో అవకతవకలు, నిలుపుదల, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
కాంగ్రెస్: అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ప్రచార తారలను రప్పించి.. డివిజన్‌లో పాదయాత్రలుగా తిరుగుతున్నారు. పైవంతెనలు, ఐటీ కంపెనీలు, రహదారులు అంటూ బస్తీలు, మురికివాడలను నిర్లక్ష్యం చేసిందనే అంశాన్ని బలంగా తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటుంది. కొన్ని చోట్లకు ప్రధాన నేతలు రాకపోవడంతో అభ్యర్థులే బస్తీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
ప్రచారాస్త్రం: తమ హయాంలోనే బస్తీలు, మురికివాడల్లో అభివృద్ధి జరిగిందనే అంశాన్ని బలంగా తీసుకెలుతోంది. వరదల ఇబ్బందులు, వరద సాయం అందకపోవడం వంటి విషయాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.
ఏఐఎంఐఎమ్ గత ఎన్నికల్లో ఎంఐఎం 44 డివిజన్లలో విజయం సాధించింది. ఈ సారి ఆ సంఖ్య పెంచుకుని సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే పోటీ చేస్తున్న 52 డివిజన్ల పరిధిలోని బస్తీలు, మురికివాడలపై ప్రత్యేక దృష్టి సారించింది. నేతలు పాదయాత్రలు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రంగంలోకి దిగారు.
ప్రచారాస్త్రాలు: ఒకే సామాజిక వర్గం అని కాకుండా పేదలంతా మనవారేనని బస్తీ ప్రజలను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
లఫె్ట్ పార్టీలు, జనసేన, తెదేపా తదితర పార్టీలూ బస్తీలు, మురికివాడలపై ప్రత్యేక దృష్టి సారించాయి. తెదేపా, జనసేన నాయకులు ఆ దిశగా ఇప్పుడిప్పుడే కార్యకర్తలతో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
- జీహెచ్‌ఎంసీ పరిధిలో మురికివాడలు 1,466
- గుర్తింపు పొందనివి 310
- గుర్తింపు పొందినవి 1,156
ఇదీ చదవండి :