విజయవాడలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - విజయవాడలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
విజయవాడ పాయకాపురంలోని వైకాపా నేత సీహెచ్ రవి ఆధ్వర్యంలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. డిసెంబర్ నెల ప్రారంభం నుంచే క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడం అభినందనీయమని విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.