SEC On Voter List Amendment : ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ ఈనెల 6న తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాసిన లేఖకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. వర్ల ప్రస్తావించిన అంశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఒక కుటుంబంలోని ఓటర్లను.. వేర్వేరు బూత్‌లకు జంబ్లింగ్ చేశారన్న అంశంపైనా స్పందించిన ఎస్‌ఈసీ.. ఒక భవనంలో నివసిస్తున్న కుటుంబానికి ఒకే బూత్‌లో ఓటుహక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇంకా.. మృతిచెందిన, వలస వెళ్లిన ఓటర్లను, వివిధ చోట్ల ఓట్లు కలిగిన వ్యక్తులను ఓటర్ జాబితా నుంచి వెంటనే తొలగించాలని ఎస్‌ఈసీ పేర్కొంది. వీఆర్ఏ, గ్రామ, వార్డు వాలంటీర్లు అధికార పార్టీ ఓటర్లను ఓటర్ జాబితాలో ఉంచి, ప్రతిపక్షాల ఓటర్లు తొలగిస్తున్నారన్న అంశంపైనా విచారించి నివేదిక పంపాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.
ఇదీ చదవండి :
Varla Ramaiah: 'ఓటరు జాబితాలో లోపాలు సవరించండి'.. ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య వినతి